Pakistani Nationals Arrested: యూఎస్ లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు సృష్టించి.. వాటిని చూపించి అక్రమంగా వీసాలు పొందుతున్న రాకెట్ గుట్టురట్టు అయింది. ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్తానీయులను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Cyber Fraud: సాంకేతిక ప్రగతికి అనుగుణంగా సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో దాడి చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాల పేరుతో ఫేక్ లింకులు పంపుతూ ఫోన్ క్లిక్‌తోనే ఖాతాల్ని ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్ల పేరుతో వచ్చే లింకులను బదులిచ్చే ముందు ఒక్కసారైనా ఆలోచించాలని…
బ్యాంకాక్ లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి మయన్మార్ కేంద్రంగా సైబర్ ఫ్రాడ్ కేఫ్ లో బందీలుగా మారి బలవంతంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న తెలంగాణకు చెందిన యువతకు విముక్తి లభించింది. వీరిలో ముగ్గురు తెలంగాణకు చెందిన వారు కాగా, మరొకరు ఏపీకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని వీరిని స్వదేశానికి రప్పించారు.