YSRCP: వైసీపీకి మరో షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై..
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్..
- పార్టీకి గుంటూరు కీలక నేత గుడ్‌బై.. పార్టీ పదవికి
- వైసీపీ క్రియాశీలక సభ్యతానికి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.. ఇప్పటికే వైసీపీకి గండి కొట్టి పలు మున్సిపాల్టీలను తన ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీ.. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడుతున్నారు.. ఇక, తాజాగా, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. 2019లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మద్దాలి గిరి.. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ప్రస్తుతం వైసీపీ గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కొందరు నేతలు పార్టీని వీడుతున్న తరుణంలో.. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవితో పాటు వైసీపీ క్రియాశీలక సభ్యతానికి కూడా రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి.. రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే వైసీపీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. మరి, ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా..? తిరిగి టీడీపీ గూటికి చేరుతారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Read Also: Komati Reddy Venkat Reddy: రహదారుల నిర్మాణాలపై సెక్రటరీతో మంత్రి చర్చలు..
Also Read
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
తాజావార్తలు
-
India On Nepal: నేపాల్ ప్రధానికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఎందుకంటే..
-
CBSE OSM Controversy: OSM వ్యవహారంపై కేంద్రం సీరియస్.. CBSE ఉన్నతాధికారులపై వేటు
-
Peddi: ‘పెద్ది’ సినిమాకి అసలు ట్రైలరే అక్కర్లేదు.. కంటెంట్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు: బుచ్చిబాబు సంచలనం
-
India-Venezuela: భారత్‌కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!