Venkaiah Naidu: తెలుగులో తిట్టినా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు..!
- తెనాలి ప్రచురణలు భారత జ్యోతి పురస్కార ప్రదానం వేడుకల్లో వెంకయ్య కీలక వ్యాఖ్యలు..
- తెనాలి ప్రాంతం అంటే ఎంతో అభిమానం ఇక్కడి నుంచే ఎన్నో పోరాటాలు చేశాం..
- సంస్కృతిని సంప్రదాయాలను కాపాడుతున్న ప్రాంతం తెనాలి..
- సంస్కృతిని సంప్రదాయాల కోసం యువత గట్టిగా కృషి చేయాలి..
- తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది ..
- అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: తెలుగులో తిట్టినా కూడా అద్భుతంగా ఉంటుంది.. అమ్మ భాషని మరిచిపోయినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు.. గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో భారత జ్యోతి పురస్కార ప్రదాన వేడుకలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సమాజ పరిశీలనా శోధకుడు, శోధన సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు భారత జ్యోతి పురస్కారం అందుకున్నారు.
Read Also: Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. పిడికె రావు సేవలను విని, ఆయన్ని కలవాలని, అవార్డు ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను అన్నారు.. తెనాలి ప్రాంతానికి ఎంతో అభిమానం, ఇక్కడి నుంచి ఎన్నో పోరాటాలు చేశాం. సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడడం యువత బాధ్యత.. యువత గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఇక్కడ కలిసిన దృష్టి అవార్డు ఇవ్వటం మాత్రమే కాదు, మానవత్వపు విలువలు కాపాడుకోవడం కూడా అన్నారు.. ఇక, అమ్మ భాషను మరచినవాడు మనిషే కాదు అని వ్యాఖ్యానించారు.. ఇక, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను తెలుగు పరిపాలన చేపట్టమని సూచించాను.
ఇక, పిడికె రావు మనసు నిండా పేదవాడిపై ప్రేమ కలిగి ఉన్నాడు. అమెరికాలో వేల డాలర్లు సంపాదించి వాటన్నింటిని వదిలేసి, పేద ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తున్న అసాధారణ నిర్ణయం కామేశ్వరరావు ది అన్నారు వెంకయ్యనాయుడు.. మరోవైపు, ఉచిత పథకాలపై హాట్ కామెంట్స్ చేశారు వెంకయ్య.. ఉచితాలు ఇచ్చినప్పుడు, మనుషులు సోమరిపోతులుగా తయారవుతారు… ఉచిత విద్య, ఉపకరణాలు పేదవారికి మాత్రమే అందించాలి.. కానీ, చేపలు ఉచితంగా ఇవ్వకూడదు, చేపలు పట్టడం నేర్పించాలి అని సూచించారు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉచితాల ఆర్థిక భారాన్ని గమనించి, ఆలోచించాలని సూచించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!