Merugu Nagarjuna: రాజకీయాలలో ఎదుగుతున్న ఒక దళితుడిని టార్గెట్ చేస్తున్నారు.. తప్పు తేలితే దేనికైనా సిద్ధం
- మాజీ మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు
- ఎవరో ఒక మహిళ నాపై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది- మేరుగు నాగార్జున
- నేను ఆమెను శారీరకంగా లోబర్చుకుని 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుంది- మేరుగు
- నేను ఏ పరీక్ష కైనా సిద్ధం- మేరుగు నాగార్జున
- రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని.. పేదవాడిని టార్గెట్ చేస్తున్నారు- మేరుగు
- నా తప్పు తేలితే ఉరి శిక్ష కైన సిద్ధం- మేరుగు నాగార్జున.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు. రాజకీయాలలో ఎదుగుతూ ఉన్న ఒక దళితుడిని, పేదవాడిని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తన తప్పు ఉందని తేలితే ఉరి శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. తనపై కోపం ఉంటే చంపండి.. అంతేగానీ ఇలాంటి దుష్ప్రచారం చేయకండని ఆయన సూచించారు.
Read Also: Congress: హర్యానా ఫలితాలపై తీవ్ర అసంతృప్తి.. ఈసీపై చట్టపరమైన చర్యలకు వెనకాడబోమని హెచ్చరిక
Also Read
- Ambati Rambabu: వైసీపీ కేడర్‌ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
కుట్ర ప్రకారం ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు.. తాను మంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది కలిసి ఉంటారు.. కానీ వ్యక్తిగతంగా ఎవరితో పరిచయం లేదని మేరుగ నాగార్జున తెలిపారు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తా.. ఏ ఆధారంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టబోతున్నారు.. తాను దేనికైనా సిద్ధమని అన్నారు. ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తే ప్రైవేట్ కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై పోలీసులు నిజాయితీగా దర్యాప్తు చేయాలని అన్నారు.
Read Also: IND vs NZ: తడబడ్డ టీమిండియా బ్యాటర్లు.. మొదటిరోజు ఆట ముగిసే సరికి
కాగా.. మేరుగ నాగార్జునపై గుంటూరు జిల్లాలో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో తాడేపల్లి పోలీసులు కేసును నమోదు చేశారు. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 90 లక్షలు తీసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ తాడేపల్లి సీఐ కల్యాణ్రాజ్కు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. తన వద్ద తీసుకున్న డబ్బులను తనకు తిరిగి ఇవ్వాలని మాజీ మంత్రిని అడిగితే బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాగైనా న్యాయం చేయాలని, మేరుగ నాగార్జున తనకు ఇవ్వాల్సిన రూ. 90లక్షలను తనకు ఇప్పించాలని పోలీసులను ఆ మహిళ కోరారు.
తాజావార్తలు
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
-
Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
-
Air India: సౌదీ అరేబియాకు విమానాలు రద్దు.. జెడ్డా, రియాద్, దమ్మామ్ సర్వీసులు నిలిపివేత..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!