Site icon NTV Telugu

Andhra Pradesh Crime: పెళ్లింట విషాదం.. శోభనం రాత్రి పడకగదిలోనే వరుడు మృతి..!

Groom

Groom

పెళ్లింట విషాదం నెలకొంది.. పండుగ వాతావరణంలో పెళ్లి జరిపించి ఒక రోజు గడవక ముందే వరుడు కన్నుమూయడం తీవ్ర విషాదంగా మారింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని మదనపల్లెలో పెళ్లి జరిగి 12 గంటలు గడవక ముందే వరుడు మృతిచెందాడు.. చంద్రాకాలనీలో తులసిప్రసాద్‌కు శిరీష అనే యువతితో సోమవారం ఉదయం వివాహం జరిగింది… ఇక, మంగళవారం రాత్రి పెళ్లి కూతురు ఇంటి దగ్గర శోభనానికి ఏర్పాట్లు చేసినట్టు చేశారు.. అయితే, శోభనం రోజు రాత్రి పడకగదిలోనే వరుడు తులసిప్రసాద్ మృతి చెందడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: AP Assembly Session: రేపటి నుంచే అసెంబ్లీ.. చంద్రబాబు కూడా సభకు రావాలి!

అయితే, తులసిప్రసాద్‌ గుండెపోటుతో మృతిచెందినట్టుగా తెలుస్తోంది.. ఉన్నట్టుండి పడకగదిలో వరుడు అచేతనంగా పడిపోవడంతో.. ఆందోళనకు గురైన వధువు.. కుటుంబ సభ్యులకు తెలిపింది.. వారు వెంటనే వరుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే తులసిప్రసాద్‌ మృతిచెందినట్టు చెబుతున్నారు.. మృతిచెందిన వరుడు తులసిప్రసాద్‌ స్వగ్రామం పాకాల మండలం కట్టకిందపల్లి.. దీంతో, మదనపల్లి నుంచి వరుడు మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తరలించారు కుటుంబ సభ్యులు.. అయితే, పెళ్లి జరిగిన ఒక్కరోజులోనే వరుడు మృతిచెందడం.. విషాదంగా మారింది.. కాగా, వధూవరులిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు.. కానీ, పెళ్లి జరిగి.. పచ్చిన పందిళ్లు, తోరనాలు వాడిపోకముందే.. వరుడు ప్రాణాలు పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version