Deputy CM Pawan: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ పై సచివాలయంలో అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని గ్రేట్ గ్రీన్ వాల్ ను 2030 నాటికి రాష్ట్రంలోని 1,034 కిలో మీటర్ల తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రీన్ బెల్ట్‌ను సృష్టికి నిర్దేశించిన పర్యావరణ ప్రాజెక్ట్ అన్నారు. తుఫానులు, సముద్ర మట్టం పెరుగుదల, కోత నుంచి రక్షించడానికి “జీవన పర్యావరణ కవచం”దీని ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: Xiaomi EV Cars: మొబైల్స్తో పాటు కార్ల తయారీ.. 2026లో ఏకంగా 5.5 లక్షల ఈవీల ఉత్పత్తి..
ఇక, జీవ వైవిధ్యం, జీవనోపాధిని పెంచేలా ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఆఫ్రికన్ గ్రేట్ గ్రీన్ వాల్ నుంచి ప్రేరణ పొంది మడ అడవులు, సరుగుడు, ఇతర ఉప్పు-తట్టుకునే చెట్ల తోటలపై దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ఈ సమావేశానికి అటవీ- పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పీవీ చలపతి రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.