Deputy CM Pawan: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ పై సచివాలయంలో అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని గ్రేట్ గ్రీన్ వాల్ ను 2030 నాటికి రాష్ట్రంలోని 1,034 కిలో మీటర్ల తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పు గల గ్రీన్ బెల్ట్‌ను సృష్టికి నిర్దేశించిన పర్యావరణ ప్రాజెక్ట్ అన్నారు.