అభివృద్ధిలో విద్య కీలక భూమిక పోషిస్తుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు.అమరావతిలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో వెబ్‌నార్ ద్వారా గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెమ్ హస్పటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి. పలనివేలు, పద్మభూషణ్ డా. డి. నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కువ శస్త్ర చికిత్సలు చేసి వైద్యరంగానికి ఎనలేని సేవలందించిన డా. డి నాగేశ్వర్‌రెడ్డి, పళనివేలకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. 125 మందికి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, నగదు బహుమతులను ప్రధానం చేశారు.
Read Also:రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుంది: చంద్రశేఖర్ రెడ్డి
అనంతరం గవర్నర్ ప్రసంగించారు. డిజిటల్ టెక్నాలజీలతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవడానికి కరోనా కారణమైందని గవర్నర్ అన్నారు. మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొవడంలో విద్యారంగం పోరాడుతుందన్నారు. పరిశోధనలను ప్రోత్సహించటానికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి అభినందనీ యమని పేర్కొన్నారు. పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించే దిశగా జాతీయ పోషకాహార సంస్ధతో ఎన్టీఆర్ యూనివర్సీటీ ఎంఓయూ కుదుర్చుకోవడం శుభపరిణామమని గవర్నర్ అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా, ధ్యానం సాధన చేయాలని చెప్పారు. నిత్య విద్యార్థిగా ముందడుగు వేస్తేనే విజయం బానిస అవుతుందని గవర్నర్ తెలిపారు.