రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుంది: చంద్రశేఖర్‌ రెడ్డి

ఏపీలో పీఆర్సీ వ్యవహారం హట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు సీఎం జగన్‌తో సమావేశమైన సంగతి తెల్సిందే.. తాజాగా ఈ రోజు ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఏపీ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల సమస్యలను సీఎం విన్నారని ఆయన వెల్లడించారు. రెండు రోజుల్లో పీఆర్సీ వ్యవహారం ముగుస్తుందన్నారు. కొన్ని సంఘాలు 27 శాతం ఫిట్‌మెంట్‌ను తగ్గకుండా చూడాలని కోరాయని తెలిపారు. కొన్ని సంఘాలు 34 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని సీఎంను కోరినట్టు ఆయన వెల్లడించారు. పాత హెచ్‌ఆర్‌ఏను కొనసాగించాలని చెప్పాయన్నారు.

Read Also:రాజీనామా చేసే ఉద్దేశం లేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్ నుంచి రాజధానికి వచ్చిన ఉద్యోగులకు సీసీఎ, హెచ్ ఆర్ ఎ కొనసాగించాలన్నారు. 30శాతం హెచ్ఆర్ఎను కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు సీఎంను కోరినట్టు ఆయన వెల్లడించారు. కోవిడ్ వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిన విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం తెలిపారని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. 2,3 రోజుల్లో పీఆర్సీ పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. రాబోయే రెండు రోజుల్లో ఉద్యోగ నేతలను సీఎం పిలిచి మంచి పీఆర్సీని ప్రకటిస్తారనే నమ్మకముందని చంద్రశేఖర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles