Gorantla Madhav: ఆ వీడియోపై నేను ప్రమాణం చేస్తా.. చంద్రబాబు కూడా ప్రమాణం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: తన వీడియో ఫేక్ వీడియో అని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే నిజమని తేలిందని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యానించారు. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్టుతో మరోసారి టీడీపీ దొరికిపోయిందని.. అమెరికా నుంచి ఓ ఫేక్ రిపోర్ట్ తెప్పించారని.. ఈ రిపోర్టుతో చంద్రబాబు నానా యాగీ చేశారని ఆరోపించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ అక్కడి నుంచి తెప్పించిన వివరాలతో టీడీపీ పరిస్థితి కుడితిలో పడిన బల్లి లాగా తయారైందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబు గురించి కొన్ని మీడియా సంస్థలు ఏనాడైనా చర్చకు పెట్టాయా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికి తెలుకుట్టిన బల్లిలా చంద్రబాబు పారిపోయి వచ్చాడని గోరంట్ల మాధవ్ ఆరోపించారు. తన వీడియోపై చంద్రబాబు ఇంతగా తైతక్కలాట ఆడాల్సిన అవసరం లేదని.. ఓటుకు నోటు వీడియో తనది కాదు అని కాణిపాకం వినాయకుడి దగ్గర చంద్రబాబు ప్రమాణం చేస్తే.. తాను కూడా ప్రమాణం చేస్తానని.. తన రాజీనామాను ఆయన ముఖాన కొడతానని గోరంట్ల మాధవ్ స్పష్టం చేశారు.
Read Also: Pawan Kalyan: ఇదేం భక్తి అండీ బాబు.. పవన్ కోసం పవన్ మాల వేసుకున్న అభిమానులు
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
పబ్లిక్ మీటింగ్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆడపిల్ల కనిపిస్తే ముద్దు అయినా పెట్టాలి.. కడుపు అయినా చేయాలని చెబితే ఏ రోజు అయినా చర్చకు పెట్టారా అని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. లోకేష్ మహిళలతో ఏ రకంగా నిస్సిగ్గుగా ఫోటోల్లో ఉన్నాడో కూడా చర్చ చేపట్టాలన్నారు. టీడీపీ బీసీ సోదరులు ఈ విషయాలపై నిలదీయాలని సూచించారు. చంద్రబాబు అధికారలోకి రావాలని ఫేక్ వీడియోతో నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఫేక్ వీడియో, ఫేక్ సర్టిఫికెట్తో ఆనంద పడ్డారని.. కానీ చివరికి న్యాయం, ధర్మం, చట్టం గెలుస్తాయని.. విజేతను తానేనని గోరంట్ల మాధవ్ తెలిపారు. తన వీడియో అంశంపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేశానని.. న్యాయపరమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!