గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గినా.. ఇంకా, పూర్తిస్థాయిలో తగ్గింది మాత్రం లేదు.. గోదావరిలో వరద ఉధృతి ఉండడంతో.. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత నీటిమట్టం 20.2 అడుగులుగా ఉందని.. వరద ప్రవాహం 23 లక్షల 30వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు.. దీంతో, మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.. గోదావరిలో ప్రస్తుత పరిస్థితిపై ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.. గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతుందని.. ప్రస్తుతానికి ధవళేశ్వరం వద్ద నిలకడగా వరద ప్రవాహం ఉందని తెలిపింది.
Read Also: Presidential Poll 2022: నేడే రాష్ట్రపతి ఎన్నిక.. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్
ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది విపత్తుల నిర్వహణ సంస్థ.. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నామని.. సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయని.. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 385 గ్రామాలు వరద ప్రభావితం అయ్యాయని.. మరో 241 గ్రామల్లోకి వరదనీరు చేరిందని తెలిపారు.. ఇప్పటివరకు 97,205 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. 84,734 మందిని 191 పునరావాస కేంద్రాల్లో పెట్టామని.. 256 మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని.. 1,25,015 ఆహార ప్యాకేట్లు పంపిణీ చేసినట్టు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్..