గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది.. భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గినా.. ఇంకా, పూర్తిస్థాయిలో తగ్గింది మాత్రం లేదు.. గోదావరిలో వరద ఉధృతి ఉండడంతో.. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు అధికారులు.. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత నీటిమట్టం 20.2 అడుగులుగా ఉందని.. వరద ప్రవాహం 23 లక్షల 30వేల క్యూసెక్కులుగా ఉందని అధికారులు వెల్లడించారు.. దీంతో, మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు.. గోదావరిలో ప్రస్తుత పరిస్థితిపై…