Godavari Floods: నిలకడగా గోదావరి.. కానీ,
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి ఉధృతి కొనసాగుతోంది.. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతుంది.. గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద నిలకడగా ఉంది. గోదావరి వరద తగ్గుముఖం స్వల్పంగానే ఉంటుందని చెబుతున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునగగా దేవస్థానం కల్యాణ కట్ట కిందిభాగం ఇంకా నీటిలోనే ఉంది. దీంతో అటుగా ఎవరిరీ రానీయకుండా పటిష్ఠ గస్తీ ఏర్పాటు చేశారు. మరోవైపు గోదావరి వరద కారణంగా మరోసారి విలీన మండలం వేలేరుపాడులో ఇళ్లు నీట మునిగాయి. రుద్రంకోటలోని సుమారు 4 వందల కుటుంబాల వారు బతుకుజీవుడా అంటూ సమీపంలోని గుట్టపైన గుడారాల్లో పిల్లాపాపలతో జీవనం సాగిస్తున్నారు. నిత్యావసర సరకుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు.
Read Also: Black Sand: రంగు మారుతోన్న సముద్రం.. ఏం జరిగిందబ్బా..?
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
కుక్కునూరు మండలంలో వెంకటాపురం, ఎల్లప్పగూడెం, కోమట్లగూడెం పరిసర ప్రాంతాల్లో సమీపంలోకి వరద వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని బూర్గంపాడు వద్ద ఇప్పటికే రహదారి మునిగిపోయింది. ఈ మార్గంలో పయనించే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని కుక్కునూరు పోలీసులు సూచిస్తున్నారు. ఎగువన వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతుంది. దాదాపు పదిహేను లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి కాస్త తగ్గముఖం పట్టినా.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ప్రమాద హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఆలయాలన్ని వరదనీటిలోనే ఉన్నాయి. ఆలయ ప్రాంగణాలలో వరదనీరు చేరడంతో ఆలయాలను మూసివేశారు. నదీ ప్రవాహాం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి చెంతకు ఎవ్వరు వెళ్లకుండా పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు.గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!