Minister Srinivasa Rao: విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ తర్వాత ప్రపంచమే మన వైపు చూస్తుంది అని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీఐఐ సమ్మిట్ తర్వాత ఆంధ్రపదేశ్ ప్రపంచంలోనే ప్రత్యేకం గా నిలిచింది.. వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏం మాటాడుతున్నారో వాళ్లకే తెలియటం లేదు.. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ నేతలు ఏమి చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొని వచ్చింది.. విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు.. యువ నేత నారా లోకేష్ యువగళంలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో 20 లక్షలు ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తున్నాం అన్నారు. గత ఐదేళ్లు ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ ఏం చేసిందని మంత్రి శ్రీనివాసరావు అడిగారు.
Read Also: IND vs SA: ముగిసిన తొలిరోజు ఆట.. భారత్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం!
అయితే, నేడు 3 లక్షలు మెట్రిక్ టన్నులను ప్రభుత్వం కొలుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా గన్నీ సంచులు తీసుకుంటే, వాళ్లకు డబ్బులను చెల్లిస్తున్నామన్నారు. రైతులకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది.. జిల్లాలో అనేక పరిశ్రమలు వస్తున్నాయి, త్వరలో భారీగా ఉద్యోగాలు రాబోతున్నాయి.. అలాగే, త్వరలో విజయనగరంలో ఐటీ కంపెనీలు పెట్టబోతున్నారు.. రైతులు పండించిన వడ్లను రైస్ మిల్లుకు పంపించిన గంటల వ్యవధిలోనే అన్నదాతల అకౌంట్లో సొమ్ము జమ అవుతుంది అని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.