TGTET Exam: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుండి ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 17 జిల్లాల్లో మొత్తం 92 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. రోజుకు రెండు సెషన్లుగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. టెట్‌కు రెండు పేపర్లకు కలిపి మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-I కు 94,335 మంది, పేపర్-IIకు 1,81,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.…
దేశ వ్యాప్తంగా నిర్వహించే సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ-టెట్) పరీక్షను వాయిదా వేశారు. ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. అయితే ఆన్‌లైన్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్టు ప్రకటించారు. దేశంలో వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షలు జనవరి 13 వరకు జరగనున్నాయి. మొదటి రోజు పేపర్ -2 పరీక్షలో సర్వర్ సమస్య తలెత్తింది. సాయంత్రం 4 గంటలైనా సమస్య పరిష్కారం కాకపోవడంతో పరీక్షను వాయిదా వేశారు.…
కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతబడి ఈమధ్యే తెరుచుకున్నాయి. విద్యార్ధులు పరీక్షలు కూడా రాస్తున్నారు. అయితే విద్యార్ధులు ఆన్ లైన్ పరీక్షలకే రెడీ అవుతున్నారు. విశాఖలోని గీతం విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఉన్న కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆఫ్ లైన్ కాకుండా ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహించాలని ఆందోళన చేపట్టారు వందలాదిమంది విద్యార్ధులు. 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనలో పాల్గొనడంతో గీతం ప్రాంగణంలో గందరగోళం నెలకొంది.భోరున వర్షం పడుతున్నా విద్యార్దులు ఆందోళన…