CM Chandrababu: పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. వైఎస్ జగన్ కుట్రలను ప్రభుత్వంతో పాటు పార్టీ నేతలూ తిప్పికొట్టాలి.. మంత్రులు మాట్లాడారు కదా మాకెందుకులే అని నేతలు అనుకోవద్దు.. కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారాన్ని అందరూ అడ్డుకోవాలి.. జగన్ అసత్య ప్రచారాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ముఖ్యమంత్రి.. మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కాలేదన్న పార్టీ సీనియర్ నేతలు.. సిట్ విచారణ కొనసాగుతుంది.. చట్టం తన పని తాను చేస్తుందన్నారు సీఎం.. ఇక, విశాఖకు గూగుల్ రావడంపై ముఖ్యమంత్రిని సీనియర్ నేతలు అభినందించారు.
Read Also: Bhatti Vikramarka : ఇది ఉద్యోగ నియామక పత్రం కాదు.. నిరుద్యోగుల కన్నీళ్లు తుడిచే పత్రం
అయితే, భవిష్యత్తు అంతా యువతదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యువత కోసమే పార్టీ కార్యాలయంలో అనేక నిర్మాణాలు చేపడుతున్నాం.. కొత్త తరం రాజకీయ నాయకులకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరంతరం శిక్షణ ఇస్తాం.. ఈ దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గూగుల్ రావడం సంతోషకరం అని పేర్కొన్నారు. గూగులే ఏపీ ప్రజలకి అతి పెద్ద దీపావళి అని చెప్పుకొచ్చారు.