ఈరోజు ఏపీలో జుడిషియరీ వర్సెస్ ఎగ్జిక్యూటీవ్ అనే అంశంపై ఆంధ్రా విజ్జమ్ ఫెస్టివల్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. అందులో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ… మెజారిటీ వాళ్ళు నిర్ణయించేది చట్టం కాదు. ఇలాంటి నిర్ణయాలను సరి చేసేందుకే న్యాయ వ్యవస్థ ఉంది. వ్యవస్థలో వ్యక్తి పూజ మంచిది కాదని అంబేద్కర్ అన్నారు. ఆందోళనలు, సత్యాగ్రహాలు లేకుండా చూడాలి అయితే.. ఇప్పుడు అలా జరగడం లేదు. రైతులు వందల రోజులు ఆందోళనలు చేస్తున్నారు వారిని పట్టించుకోవడం లేదు అలా జరగకూడదు. వ్యవస్థ లో ఎవరి పాత్ర వాళ్ళు పాటించాలి. ఒకరి చేసిన తప్పును జ్యూడిషియరి తప్పు పడితే దాన్ని సూచనగా తీసుకోవాలి.. సరి చేసుకోవాలి. కోర్టులు చెప్పాక కూడా దాన్ని మార్చేందుకు చట్టసభలు ప్రయత్నించండం మంచిది కాదు అని పేర్కొన్నారు.