Tigers Romance: అక్కడ పులుల రొమాన్స్ కు ఏర్పాట్లు…ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పులుల సంతతి (Tiger Population) పెంచాలని అటవీ శాఖ భావిస్తోంది. అందుకే కొన్ని ఏర్పాట్లు చేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోకి నో ఎంట్రీ జోన్ పెట్టారు. మానవ అడుగు చప్పుళ్ళు కూడా వినిపించరాదు….పెద్ద పులుల రొమాన్స్ కి ఎలాంటి అంతరాయం కలగకూడదంటే ఎలాంటి శబ్దాలు, మానవ సంచారం ఉండకూడదు. అందుకే నల్లమల అడవిలో ఇపుడు సైలెన్స్ సీజన్ నడుస్తోంది. దేశంలో పెద్ద పులుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుంది.
అందుకు అనేక కారణాలు. పెద్ద పులుల పాపులేషన్ పెంచేందుకు వాటికి ఏకాంత వాతావరణం కావాలి. అందుకు ఆటవీశాఖ పెద్దపులులు సంగమించే కాలంలో వాటికి ఏకాంతంగా ఉబడే పరిస్థితులు కల్పిస్తున్నారు. నల్లమల అభయారణ్యం పెద్ద పులుల అవాసానికి అనుకులమైంది. అందుకే నల్లమల అడవిలో పెద్ద పులుల సంఖ్య పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నల్లమలలో పర్యాటక కేంద్రాలు, ఇష్టకామేశ్వరి ఆలయానికి అటవీ శాఖ అనుమతులు నిరాకరించింది. పెద్ద పులులు ఏకాంతంగా రొమాన్స్ లో మునిగిపోవాలని…పులుల పునరుత్పత్తికి అవకాశం కల్పించాలని అటవీ శాఖ నానా పాట్లు పడుతోంది.
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
పెద్ద పులి అంటేనే మనమంతా భయపడతాం. పెద్ద పులి నడక, ఠీవి మామూలుగా ఉండదు. కానీ దానికి చాలా సిగ్గు. పెద్ద పులి ఆడ పులితో రొమాన్స్ చేయాలంటే ఏకాంతం కావాలి. రెండు పులులు సంగమించే సమయంలో చిన్న అలికిడి వినిపించినా రొమాన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాయి. ఈ లక్షణం కూడా పులుల సంఖ్య పెరగకపోవడానికి ఓ కారణం. పులుల రొమాన్స్ కి ఇది సరైన సీజన్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు పులుల సంగమించేందుకు ఇష్టపడే కాలం. అందుకే అటవీ శాఖ జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు నల్లమలో పర్యాటక కేంద్రాలు, ఇష్టకామేశ్వరి అలయానికి అనుమతులు నిరాకరించింది. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది. 2015 నుంచి ఇది అమలులో ఉంది. అడవుల్లో తరచూ మానవ సంచారం కారణంగా పెద్ద పులులు సంగమించడం తగ్గిపోయి పునరుత్పత్తి తగ్గిందని ఒక అంచనా.
Viral: నదిలో యువకుడి స్టంట్.. తిరిగిరాలేదు..
పెద్ద పులుల గర్భధారణ తగ్గిపోవడానికి మానవ సంచారం కూడా ఒక కారణమని జంతు ప్రేమికులు, పర్యావరణ వేత్తలు శాస్త్రీయంగా చెబుతున్నారు. పెద్ద పులులు సంగమించే కాలంలో వాటి ప్రవర్తన కూడా భిన్నంగా ఉంటుంది. సంగమ సమయంలో ఆవేశంతో ఉంటాయి. ఆ సమయంలో మనుషులు కనిపిస్తే దాడి చేసే అవకాశాలు ఎక్కువ. సంగమ సమయంలో పెద్ద పులులు తన టెర్రిటరీలో ఇతరుల ప్రవేశాన్ని అంగీకరించవు. దీంతో పెద్ద పులులకు ఏకాంత వాతావరణం కల్పించేందుకు జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు నల్లమల అడవిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. అటవీ శాఖ అధికారుల ప్రయత్నాలు ఫలిస్తే నల్లమల ప్రాంతంలో పులుల సంతతి పెరగడం ఖాయం.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!