Modis Cabinet: ప్రధానిగా మోదీ ఈ రోజు మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గం ఖరారైంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. తెలంగాణ నుంచి ఇద్దరు.. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాగా.. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ అవకాశం ఇవ్వాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. ఎంపీ కిషన్ రెడ్డి,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ ఇద్దరు ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read also: Madhyapradesh : ప్రపంచంలోనే ఖరీదైన మామిడి దొంగతనానికి వచ్చిన దొంగలను తరిమిన కుక్కలు
ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. అయితే మోడీ తన క్యాబెనెట్‌లో ఎవరెవరికి చోటుకల్పిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీతోపాటు మిత్రపక్షాలకు చెందిన పలువురు ఎంపీలకు ఫోన్ కాల్స్ వెళ్లాయి. ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీ రావాలంటూ ఆహ్వానాలు అందినట్లు తెలుస్తున్నది. ఆ జాబితాలో రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, అమిత్ షా, నిర్మలా సితారామన్, హర్దీప్ సింగ్ పూరి, అశ్వినీ వైష్ణవ్, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, జ్యోతిరాదిత్య సింధియా, అర్జురామ్ రామ్ మెఘ్వాల్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియా పటేల్, జీతన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి, హెచ్‌డీ కుమార స్వామి, బండి సంజయ్, కిషన్ రెడ్డి, కిరణ్ రిజిజు, రావు ఇంద్రజిత్, ఏపీ టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. వీరంతా మోదీతోపాటు ప్రమాణం చేయనున్నారు.
Kishan Reddy-Bandi Sanjay: తెలంగాణ ఎంపీలకు కేబినెట్ లో చోటు.. రాజకీయ ప్రస్థానం ఇదే !