Hydra: శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ హోర్డింగులపై హైడ్రా కూల్చివేతలు
- రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ హోర్డింగులపై హైడ్రా అధికారులు దాడులు.
- హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న భారీ హోర్డింగులను కూల్చేందుకు చర్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydra: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా అధికారులు నేడు (శుక్రవారం) అక్రమ హోర్డింగులపై దూకుడు పెంచారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు, ప్రత్యేకంగా అక్రమ హోర్డింగులు పెరిగినట్లు గుర్తించడంతో, హైడ్రా అధికారులు సమగ్ర తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపాలిటీలో దాదాపు 200 కి పైగా అక్రమ హోర్డింగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు శుక్రవారం చర్యలు ప్రారంభించారు. ప్రత్యేకంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న భారీ హోర్డింగులను కూల్చేందుకు భారీ పోలీసు బందోబస్తుతో చర్యలు చేపట్టారు.
Also Read: Minister Sandhya Rani: వైఎస్ జగన్పై తీవ్రంగా విరుచుకుపడ్డ మంత్రి సంధ్యారాణి
Also Read
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
ఈ సందర్భంగా చుట్టుపక్కల ఉన్న షాపులను ఖాళీ చేయించి, అక్రమ హోర్డింగులను తొలగించడం జరిగింది. ఈ హోర్డింగులకు అనుమతులు ఇచ్చిన అధికారుల వివరాలు సేకరించారు హైడ్రా అధికారులు. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి ట్యాక్స్‌లు చెల్లించకుండా అక్రమంగా హోర్డింగుల ద్వారా ఆదాయం పొందిన వారికి ఈ చర్యలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారి మనోహర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా అక్రమ హోర్డింగులను తొలగించే ప్రక్రియను విడతల వారీగా కొనసాగిస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!