Gadikota Srikanth Reddy: కలెక్టర్ల సదస్సులో చెప్పిన మాటే చెప్తున్నారు సీఎం చంద్రబాబు అని వైసీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై ఆయన ఆలోచన విధానం బయటపడింది.. మా పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు సహకరించాలని కోరడం దారుణం.. ఆయన మరీ బరితెగించి మాట్లాడారు.. లా అండ్ ఆర్డర్ పై కఠినంగా ఉంటామని మీడియాలో చెప్తారు.. బయట మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తారు.. హత్యా రాజకీయాలను బాబు ప్రోత్సహిస్తున్నారు.. 2004 వరకు చంద్రబాబు పాలనలో ఆయనపై దాడి చేసినా ఆపుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. అయితే, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ చూసినా కరువు కనిపిస్తుంది.. అధికారులు, ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తులు హత్యలు జరిగాయి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే పరిస్థితులు మారాయి.. ఏ సమయంలో నక్సలిజం, ఫ్యాక్షన్ తగ్గాయో చెప్తారు.. జలయజ్ఞం ప్రాజెక్టులు తెచ్చి హరితాంధ్ర ప్రదేశ్ నిర్మించిన వైయస్సార్.. రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రాన్ని చంద్రబాబు విడగొట్టారని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Group 1 Parents: నా కూతురు 10 లక్షల ప్యాకేజీ వదులుకుంది.. పెళ్లి ఆగింది.. మాజీ జవాన్ ఆవేదన..
అయితే, జగన్ హయంలో కరోనా ఉన్నా దేశ ఆర్థికాభివృద్ధి కన్నా రాష్ట్ర యావరేజ్ అధికంగా ఉందని శ్రీకాంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుడు 2020 అన్నారు.. ఇప్పుడు 2047 అంటున్నారు.. మాట మారుతుంది తప్ప చేసిన అభివృద్ధి కనిపించటం లేదు.. మాట్లాడితే నేను హైదరాబాద్ అభివృద్ధి చేశామంటున్నారు.. మీ కన్నా అన్ని రకాలుగా బెంగుళూరు అభివృద్ధిపై అక్కడి నేతలు చెప్పుకోరు.. మహానగరాలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి.. మళ్ళీ మీరు వచ్చాక రాష్ట్ర గ్రోత్ రేట్ తగ్గింది.. అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. 2047 రావాలంటే రెండు జనరేషన్స్ మారతాయి.. మభ్యపెట్టే మాటలు చెప్పుకోవటం తప్ప ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి ఏంటి అని అడిగారు. సచివాలయ వ్యవస్థ వల్ల గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు సేవలు దగ్గరి నుంచి అందించామని మాజీ ఎమ్మెల్యే గడికోట పేర్కొన్నారు.
Read Also: Vrushaab : మోహన్ లాల్ ‘వృషభ’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్…
ఇక, వాట్సాప్ గవర్నెన్స్ అని చంద్రబాబు మళ్ళీ మాయమాటలు చెప్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మేం చేసిన అప్పులపై కూడా దారుణంగా మాట్లాడారు.. కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలల్లోనే రెండు లక్షల కోట్లు చేరువలో మీరు చేసిన కొత్త అప్పులున్నాయి.. నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించారు.. నాడు- నేడు కింద స్కూల్స్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జగన్.. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, అన్నదాత సుఖీభవ అన్నారు.. అది సరిగ్గా ఇవ్వడం లేదు, రైతులకు యూరియా కూడా సరఫరా చేయకుండా తప్పు కలెక్టర్ల మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఇప్పుడు మళ్ళీ పీ4 అంటున్నారు, అభివృద్ధి అంటే వైయస్సార్, జగన్ చేసినట్లుగా పనులు కనిపించాలని తెలియజేశారు. మీ విధ్వంసక పాలనలో రాష్ట్రం నాశనం అయ్యింది.. ప్రాజెక్టులు కట్టనీయకుండా ఆపారు.. పోలవరం సహా పలు ప్రాజెక్టులు వైఎస్ఆర్ లైన్ లో పెట్టారు.. ఆ తర్వాత జగన్ కొనసాగించారు.. సమావేశం ఏదైనా వైసీపీ మీద బురదచల్లే ఆరోపణలను చంద్రబాబు చేయడం కామన్ అని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Asia Cup 2025: పట్టించుకోని ఐసీసీ.. తోకముడిచిన పాకిస్థాన్ బోర్డు!
మేం చేసిన అభివృద్ధి ఎంతో అంకెలతో సహా చెబుతాం.. వాటికి సమాధానం చెప్పే దమ్ము మీకు ఉందా అని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అడిగారు. రోడ్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు ఏదైనా పీపీపీ అంటారు.. ఒక్క మెడికల్ కాలేజీ అయినా చంద్రబాబు తెచ్చారా.. పులివెందుల మెడికల్ కాలేజీ సీట్లు వద్దు అని వెనక్కు పంపారు.. ఇప్పటి వరకు ఆరోగ్య శ్రీకి డబ్బులు ఇవ్వకపోవడంతో ఓపీ సేవలు కూడా నిలిచిపోయాయి.. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వాళ్లకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీల్లో మీకు మంచి మందు ఇస్తామని చెప్పిన నేత దేశ చరిత్రలో ఎవరు ఉండరు.. ఆయన ఏది చేసినా కరెక్ట్ అనేలా గొప్పలు చెప్పుకుంటారు.. పారదర్శకంగా 13 కొత్త జిల్లాలు తెచ్చాం.. మీలాగా మేం పబ్లిసిటీ చేసుకోలేదు కానీ మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు అన్నారు. ఇక, విశాఖకు ఐటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్ దే.. ఎన్నికల ముందు లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అనేక అబద్ధాలు చెప్పి రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికి కొనసాగిస్తున్నారు.. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పుకోవటం మానుకుని రాష్ట్ర అధివృద్ధిపై దృష్టి పెట్టాలని గడికోట సూచించారు.
కాగా, అమరావతిలో రాజధానిలో నీళ్లు తీసుకోవటం తప్ప ఇంత వరకు చంద్రబాబు పనులు మొదలు పెట్టలేదు అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లు ఎలా కాలం గడపాలి.. ఎన్నికలు సమయంలో ఎలా అబద్ధాలు చెప్పాలనే దానికే సరిపోతుంది.. అమరావతి మీద ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతున్నారు.. మెడికల్ కళాశాలల విషయంలో స్పష్టమైన వైకారితో జగన్ ఉన్నారు. ఇక, ఆరోగ్యశ్రీకి 2,500 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. మీరు ఎంత ఇస్తారని వాళ్ళతో పిలిచి మాట్లాడాలి కదా.. ఆస్పత్రుల బయట పేదవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడాలి అని సూచించారు. ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.
