మోలీవుడ్ స్టార్ హీరో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్-ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వృషభ’ షూటింగ్ పూర్తయి, విడుదలకు సిద్ధమైంది. ప్రశంసలు పొందిన దర్శకుడు నందా కిషోర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం వహించారు. వైభవం, స్టోరీ లైన్, స్టార్ కాస్టింగ్ కారణంగా ఈ సినిమా ఇప్పటికే బారీ అంచనాలు సృష్టించింది.
Also read : Kohli Biopic: కోహ్లీ బయోపిక్? నేను చేయను – అనురాగ్ కశ్యప్
తాజా అప్డేట్ ప్రకారం ‘వృషభ’ టీజర్ సెప్టెంబర్ 18న విడుదల కానుంది. ఈ అప్డేట్‌ను తెలియజేస్తూ, ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. షోభా కపూర్, ఎక్తా ఆర్. కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ మాస్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
The Battles, The Emotions, The Roar.
Vrusshabha Teaser drops on 18th September.#RoarOfVrusshabha #Vrusshabha #TheWorldofVrusshabha@Connekktmedia @balajimotionpic @FilmDirector_NK #ShobhaKapoor @EktaaRKapoor #CKPadmaKumar #VarunMathur @imsaurabhmishra @abhishekv_77… pic.twitter.com/v1oHpczF7w
— Mohanlal (@Mohanlal) September 16, 2025