రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్… శ్రీకాకుళం ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. 175 ఆలయాల్లో (ఈఎంఎస్) టెంపుల్ మేనేజ్ మెంట్ విధానంలో పరోక్ష సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు.. ఈఎంఎస్ ద్వారా ఇంట్లో ఉండి కూడా భక్తులు ఆన్‌లైన్‌లో పూజలు చేసుకోవచ్చన్న ఆమె.. ఈ హుండీ ద్వారా ఆన్ లైన్ లో దాతలు విరాళాలు కూడా ఇవ్వొచ్చు అన్నారు.. ఇక, ప్రతీ ఆలయంలో స్థలపురాణం, సేవలను తెలియజేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని.. ఆలయాల్లో సదుపాయాలు, సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తామని వెల్లడించారు..
భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు టైమ్ బాండ్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నామని తెలిపారు వాణీమోహన్.. ఇక, అరసవల్లి ఆలయం మాస్టర్ ప్లాన్ ను రెఢీ చేస్తున్నామని.. రాష్ట్రంలోని ఆరు ప్రధాన దేవాలయాలకు మాత్రమే మాస్టర్ ప్లాన్ ఉందని వెల్లడించారు.. రాబోయే కొన్ని నెలల్లో మరో 24 ఆలయాలకు కూడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని తన ప్లాన్‌ను వివరించారు వాణీమోహన్.