Deputy CM Pawan Kalyan: ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుడిగాలి పర్యటన..
- ఏలూరు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- కొయ్యలగూడెం, ద్వారకా తిరుమల మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన..
- ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు..
- ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. పొంగుటూరు లక్కవరం మధ్య నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు అధికారులు, ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
Read Also: Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన
Also Read
ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరి కొండపైకి వెళ్లే రహదారితో పాటు, ఆలయ ప్రదక్షిణ మండప పనులకు పవన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇక, పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా పవన్ కల్యాణ్‌ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజల పెద్ద ఎత్తున ప్రాంతానికి తరలి వచ్చారు. గత ఏడాది డిసెంబర్‌లో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో మారు స్వామి వారి దర్శనానికి రావడం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!