Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. పొంగుటూరు లక్కవరం మధ్య నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.…