Alla Nani: ఆళ్ల నాని చేరికకు లైన్ క్లియర్.. రేపే టీడీపీకి గూటికి మాజీ డిప్యూటీ సీఎం..
- టీడీపీలో ఆళ్ల నాని చేరికకు లైన్ క్లియర్..
- రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ గూటికి మాజీ డిప్యూటీ సీఎం..
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alla Nani: మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆళ్ల నాని.. తెలుగుదేశం పార్టీలోకి రావడానికి లైన్ క్లియర్ అయ్యింది. తెలుగు తమ్ముళ్లు బహిరంగంగా ఎంత వ్యతిరేకించిన చివరికి అధిష్టానం నిర్ణయానికి తలవంచక తప్పలేదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో.. అప్పుడు తాత్కాలికంగా వాయిదా పడినా.. ఇప్పుడు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో.. రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకోనున్నారు ఆళ్ల నాని. కొంత మంది కార్యకర్తలు ఆళ్ల నాని చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఏదేమైన టీడీపీ క్రమశిక్షణకు మారుపేరని.. ఆళ్ల నాని చేరిక విషయంలో అధిష్టాన నిర్ణయం శిరోధార్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బడేటి..
Read Also: CM Chandrababu: మంగళగిరి ఎయిమ్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం..
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
ఆ మధ్య టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.. అయితే, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆళ్ల నాని.. టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.. అంతేకాదు.. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే.. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని.. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు.. గతంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేశారని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఆళ్ల నాని చేరికను పోస్ట్‌పోన్ చేసింది టీడీపీ.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలతో చర్చించిన తర్వాత.. దీనిపై ఓ నిర్ణయానికి వస్తారని గతంలో ప్రకటించిన అధిష్టానం.. చివరకు ఆళ్లనాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. దీంతో.. రేపే సైకిల్ ఎక్కనున్నారు ఆళ్ల నాని..
తాజావార్తలు
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.