చట్టాన్ని ఉల్లంఘించి వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. రూల్స్ అతిక్రమించడం జగన్కు అలవాటు.. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించారు.. ఇప్పుడు, బెంగళూరులో ఉంటూ ఇక్కడి ఎన్నికల గురించి మాట్లాడితే ఎలా అని అడిగారు.
జగన్ కు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ప్రభుత్వం నిర్ణయమని అభిప్రాయపడ్డారు జీవీ హర్ష కుమార్.. కానీ, గతంలోని ఢిల్లీలో మూడు సీట్లు వచ్చినా బీజేపీకి ప్రతిపక్షహోదా ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం జగన్ ను చూసి భయపడుతోందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్ష కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ 2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు దారుణంగా మోసం చేశారని విమర్శించారు.