CM Chandrababu: నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. రాష్ట్రంలో వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పర్యటనలో.. పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత ప్రజా వేదికపై మాట్లాడుతూ.. .వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం జరుగుతుందన్నారు.. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయ్యింది.. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ఇంటింటికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.. ఏడాది కాలంలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణతో నాంది పలికాం.. ఎంత పెద్ద మొత్తంలో ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు.. డబ్బులు ఇవ్వడమే కాదు ఒకటోవ తేదీనే పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేస్తున్నాం.. సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల ఇస్తున్నాం.. తల్లి వందనం క్రింద 10 వేల కోట్ల రూపాయలు వేశాం.. ధాన్యం కొనుగోలులో కొన్ని ఇబ్బందులు వచ్చిన తరువాత కూడా రైతుల ఖాతాలో డబ్బులు.. ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నాం అని వెల్లడించారు.
Read Also: Pashamylaram Blast: పటాన్ చెరువు కెమికల్ ఫ్యాక్టరీలో మృతులకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి..
పింఛన్లు సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో నేనే నేరుగా గ్రామాలకు వచ్చి పంపిణీ చేస్తున్నాను… పేద వాడిని చిన్న చూపు చూస్తే సహించను అని హెచ్చరించారు సీఎం చంద్రబాబు.. నేను కష్టపడుతుంది పేదల కళ్లల్లో ఆనందం కోసం.. అర్హులందరికీ ఫించన్లు మంజూరు చేస్తా అని హామీ ఇచ్చారు.. గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకు ఇచ్చారని విమర్శించారు.. ఇక, ఎవరైనా డ్రగ్స్, గంజాయి వాడిని తాట తీస్తాం అని హెచ్చరించారు… డ్రగ్స్ కు బానిసలై తల్లికి,చెల్లికి, పెళ్లానికీ తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.. ఓ ఆడపిల్ల పైన అయిన చేయి వేస్తే అదే చివరి రోజు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు..
Read Also: Jai Shankar: అందుకే పాక్ పహల్గామ్ దాడి చేసింది.. ట్రంప్ వాదన అంతా తప్పు.
ఇక, నేను, ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందరం సాధారణ కుటుంబంలో పుట్టిన వారమే.. లక్ష కుటుంబాలను దత్తత తీసుకున్న, పది వేల మార్గదర్శకులు ముందుకు వచ్చారని తెలిపారు చంద్రబాబు.. రాష్ట్రానికీ పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. గత వైసీపీ ప్రభుత్వంలో పోలవరం విధ్వంసం అయ్యింది.. డయఫ్రం వాల్ దెబ్బతిని నిర్మాణం జరగలేదని విమర్శించారు. కానీ, గడిచిన ఏడాదిలో పోలవరం ప్రాజెక్టు పనులు 6 శాతం పూర్తి చేశాం.. ఇప్పటికీ. 82 శాతం పనులు పూర్తి అయ్యాయి.. పోలవరం ప్రాజెక్టును 2027కి పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు చంద్రబాబు..
Read Also: Air India Plane Crash: ఎయిర్ ఇండియా, బోయింగ్‌పై యూకే కుటుంబాల న్యాయ పోరాటం..!
రాజకీయాలకు రౌడీలు వస్తున్నారు.. రౌడీలే రాజ్యమేలే పరిస్థితికి చేరారు అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు.. వైఎస్ వివేకానంద హత్య కేసులో నన్ను మోసం చేశారు.. పోస్టుమార్టం కూడా చేయకుండా అంత్యక్రియలు చేయడానికీ ప్రయత్నించారు.. గుండెపోటు అని నమ్మించారు.. పోస్టుమార్టం చేస్తే గుండెపోటు కాదు కత్తి పోటు అని తేలిందని గుర్తుచేశారు.. రాష్ట్రంలో నేను రౌడీలతో పోరాటం చేస్తున్నా.. పెళ్లి చేసే ముందు ఏడు తరాలు వెనుకకు చూడటమే కాకుండా పుట్టు మచ్చలు సైతం చూస్తున్నారు.. కానీ, ఓటు వేసే ముందు ఇవేవి చూడకుండా వేస్తున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు..
