ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం డెడ్‌లైన్ మారిపోయింది.. మరో ఆరు నెలల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ రోజు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే చేరుకున్న కౌంటర్ వెయిట్ల అమరిక గురించి అధికారును అడిగి తెలుసుకున్నారు.