Dokka Manikya Vara Prasad: ప్రతిపక్షాలపై డొక్కా మాణిక్య విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dokka Manikya Vara Prasad Fires On Opposition Parties Over Amaravati Lands: అమరావతి లో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ళ స్థలాలను కొందరు పెద్దలు, భూస్వాములు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పేదల పక్షాన పోరాటం చేస్తాననే స్ట్రాంగ్ సీఎం జగన్ ఒక్కరేనని, అందుకే పేదలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడతామన్నప్పుడు కూడా ఇలాగే వ్యతిరేకించారన్నారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రతిపక్షాలు పేదల పట్ల వ్యతిరేఖ భావజాలంతో ఉన్నారని ఆరోపణలు చేశారు. మరి, ఇది అంబేద్కర్ భావాజాలానికి వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు పేదల పక్షాన నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు పేదల పక్షాన ఉంటారా.. పెత్తందారుల పక్షాన ఉంటారా? అని అడిగారు. గతంలో ప్రతిపక్షాలు తమకు అనుకూలమైన రాజధాని తెచ్చుకున్నారని.. అయినా అయినా మంగళగిరి, తాడికొండలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసం ఇళ్ల స్థలాలు అనేది పెత్తందారుల వాదన అని చురకలంటించారు.
Health Tips Telugu : చికెన్ ఇలా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!
Also Read
అంతకుముందు.. 38 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పష్టం చేశారు. గుంటూరు, విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు అమరావతిలో ఇళ్లస్థలాలు ఇచ్చామన్నారు. పేదలకు అమరావతిలో ఇల్లు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారని, పేదల పక్షాన పోరాడుతున్నానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో కేవలం ఒక వర్గం మాత్రమే ఉండాలని మీ ఉద్దేశమా? అని నిలదీశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ను సీఎం జగన్ ప్రభుత్వం శిరసావహిస్తోందని, ప్రతీ పేదవాడికి ఇంటి స్థలం ఉండాలనేది సీఎం జగన్ ఉద్దేశమని పేర్కొన్నారు. పేదలకు మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకునే సంస్కృతిని టీడీపీ మానుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!