YS Jagan : కూటమి పాలనలో పాఠశాల విద్యా రంగం నిర్వీర్యం
- ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గిన విద్యార్థులు
- ప్రైవేట్ బడుల వైపు పెరిగిన చేరికలు
- కూటమి సర్కార్‌పై జగన్ తీవ్ర విమర్శలు
- నాడు-నేడు ప్రస్తావిస్తూ జగన్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తీవ్రంగా పడిపోవడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన యుడైస్ ప్లస్ (UDISE+) అధికారిక గణాంకాలను ఆధారంగా చూపుతూ, కూటమి ప్రభుత్వ విధానాల వల్ల ప్రభుత్వ విద్యా రంగం దారుణంగా దెబ్బతింటోందని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయడం మానేసి, ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ముకాసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ బడుల్లో పడిపోతున్న చేరికలు.. ప్రైవేట్ వైపు విద్యార్థుల మొగ్గు
యుడైస్ ప్లస్ నివేదిక వివరాల ప్రకారం 2023-24 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 40,50,116 మంది విద్యార్థులు ఉండగా, 2025-26 నాటికి ఆ సంఖ్య 34,93,450కు పడిపోయింది. అంటే ఒక్కసారిగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గానని గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45,000 నుంచి 44,222కి, ఎయిడెడ్ పాఠశాలలు 991 నుంచి 797కి పడిపోవడం ఆందోళనకరమని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2023-24లో 45,53,380 ఉండగా, 2025-26 నాటికి 48,40,296కు పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి, అధికారిక యుడైస్ నివేదికకు అస్సలు పొంతన లేదని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
కార్పొరేట్ విద్యా సంస్థల లబ్ధి కోసమే ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం
నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే కూటమి ప్రభుత్వం ఈ రకమైన విధానాలను అమలు చేస్తోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచడం వల్ల, ప్రైవేట్ విద్యా సంస్థల్లో లభించే విద్య ఖర్చును భరించలేని పేద, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులు నాణ్యమైన విద్యకు పూర్తిగా దూరమయ్యే ఘోర పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు
గత తమ ప్రభుత్వ హయాంలో (2019-24) ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేట్‌కు పోటీగా తీర్చిదిద్దేందుకు అనేక సంస్కరణలు తెచ్చామని జగన్ గుర్తుచేశారు. ‘మన బడి – నాడు నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కాలేజీలు కలిపి మొత్తం 56,703 సంస్థల్లో తాగునీరు, పారిశుధ్యం, ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామని చెప్పారు. డిజిటల్ విద్యలో భాగంగా 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బైజూస్ (BYJU’S) కంటెంట్‌తో ఉచిత ట్యాబ్‌లు పంపిణీ చేయడంతో పాటు, 6వ తరగతి నుంచి పైతరగతులకు 62 వేల ఐఎఫ్‌పీ (IFP) డిజిటల్ బోర్డులు, ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు అందించడంతో పాటు 3వ తరగతి నుంచే టోఫెల్ (TOEFL) శిక్షణ, ఐబీ (IB) విద్యా విధానం అమల్లోకి తెచ్చేందుకు అధికారులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వివరించారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించడమే తమ ఆశయమని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!