Disha team rescues a girl in vishakapatnam: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశా కాల్ సెంటర్, యాప్ కొన్ని సంఘటనల విషయంలో బాధితులకు భరోసా ఇస్తూ అండగా నిలుస్తోంది. తాజాగా ఒక యువతిని కూడా అలాగే ఆదుకుని ధైర్యం చెప్పారు అధికారులు. విశాఖపట్నం జిల్లాలో అనుమానంతో ప్రేమించిన యువతిపై చేయి చేసుకొని గాయపరిచాడు ఒక యువకుడు. వెంటనే బాధిత యువతి దిశా SOS సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. షాక్ కలిగిస్తున్న ఈ సంఘటన విశాఖపట్నం జిల్లాలోని మువ్వలా వాని పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గత రాత్రి లెనిన్ అనే యువకుడు తన ప్రియురాలితో కలిసి విశాఖపట్నంలో ఆర్కే బీచ్ కి వెళ్ళాడు అక్కడ ఏకాంతంగా సమయం గడుపుతున్న సమయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది.
Ambati Rambabu: పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడు.. 420లా తయారయ్యాడు.. మంత్రి సంచలనం!
ఈ క్రమంలో సంయమనం కోల్పోయిన యువకుడు యువతిని తీవ్రమైన పదజాలంతో దూషించడంతో పాటు, చేతులతో కొట్టి గాయ పరిచాడు. వెంటనే భయాందోళనకు గురైన యువతి దిశా SOS సెంటర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విశాఖలోని దిశ టీం వెంటనే అలెర్ట్ అయి బాధితురాలు ఉన్న లొకేషన్ కు చేరుకున్నారు. ఆర్ కే బీచ్ లో ఒంటిరిగా ఏడుస్తూ ఉన్న బాధిత యువతికి దిశ పోలీసులు ధైర్యం కల్పించడమే కాకుండా యువతిని ఇంటి వద్ద క్షేమంగా డ్రాప్ చేశారు. ప్రియురాలిపై చేయి చేసుకున్న లెనిన్ అనే వ్యక్తిని గుర్తించిన పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రియురాలికి క్షమాపణలు చెప్పి, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని లెనిన్ ఆమెకు హామీ ఇచ్చాడు. దిశ SOS కు కాల్ చేసిన వెంటనే స్పందించిన పోలీసులకు బాధిత యువతి కృతజ్ఞతలు తెలిపి, తనలా ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలవాలని కోరింది.