Deputy CM Pawan: శేషాచలం అడవిలో జరుగుతున్న ఎర్ర చందనం దోపిడిపై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ప్రత్యేకంగా, పూర్తి స్థాయి ఆపరేషన్ ప్రారంభం అవుతుంది.. ఆపరేషన్ కాగర్ తరహాలో.. ఎర్ర చందనం తస్కరణలో ఉన్న ప్రతి ఒక్కరిని నిర్మూలించేందుకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది.. స్మగ్లర్లలో భయం నెలకొల్పుతాం.. మళ్లీ ఎవ్వరు ఒక్క ఎర్ర చందనం చెట్టునైనా తాకే ధైర్యం చేయలేని విధంగా చర్యలు తీసుకుంటాం.. శేషాచలం అడవి కేవలం అడవి కాదు.. భగవాన్ బాలాజీ పవిత్ర క్షేత్రం అన్నారు. ఎర్ర చందనం కోత ఆధ్యాత్మిక అవమానం, జాతీయ నష్టమని పేర్కొన్నారు. ఈ ఎర్రచందనం.. భూమి మీద మరెక్కడా దొరకని అపూర్వమైన సంపద అని పురాణ కథలు చెబుతున్నాయి.. ఎర్ర చందనం స్వయంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దైవ రక్తం నుంచి పుట్టిందని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు.
Read Also: Mahesh Babu Fans Celebration: టైటిల్ రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానుల్లో జోష్..
ఇక, మొక్కలు కూడా నొప్పిని అనుభవిస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనలను చెబుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తల్లి చెట్టును నరికి వేయడం అడవి మొత్తం బాధపడే నేరం.. మంగళం డిపోలో 2.6 లక్షల ఎర్ర చందనం ముక్కలు స్వాధీనం చేసుకున్నాం.. 1.3 లక్షల చెట్ల నరికివేతకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి.. ఎర్ర చందనం దోపిడీ వల్ల రూ. 2,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఇది ప్రజల ధనం.. అభివృద్ధికి వినియోగించాల్సిన డబ్బు.. స్మగ్లర్లు అడవిలోకి ఎలా వచ్చారు.. ఎవరి రక్షణ ఉంది అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఎర్ర చందనం దోపిడీ పెరిగింది.. ఎర్ర చందనం స్మగ్లర్లపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది.. అరెస్టులు మాత్రమే కాదు.. స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఎర్ర చందనం చెట్టును ఎవరూ తాకే పరిస్థితి ఉండొద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
Read Also: Mystery: లవ్ ఎఫైర్, బ్లాక్‌మెయిల్.. వీడిన తల లేని మహిళ మృతదేహం మిస్టరీ..
అయితే, శేషాచలం అటవీ పవిత్రతను కూటమి ప్రభుత్వం రక్షిస్తుంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఇక తమ ప్రభుత్వానికి జీరో టాలరెన్స్.. ఎర్ర చందనం జీవంతో ఉన్న ధనం.. అది మన జాతీయ సంపద, పవిత్రమైన ఆస్తి అన్నారు. మేము అన్నింటినీ గమనిస్తున్నాం.. మన జాతి సంపదను, శేషాచలం పవిత్రతను ఏ విధంగానైనా కాపాడుతాం అని హామీ ఇచ్చారు.