Mystery: గతవారం ఢిల్లీలోని అత్యంత విలాసమైన నోయిడా ప్రాంతంలోని ఒక కాలువలో తల లేకుండా మహిళ మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. అయితే, ఈ కేసును పోలీసులు ఛేదించారు. హంతకుడిని అరెస్ట చేశారు. నిందితుడిని సదరు మహిళ ప్రియుడిగా గుర్తించారు. బస్సు డ్రైవర్ అయిన మోను సోలంకి అరెస్ట్ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహితుడైన సోలంకి మహిళలో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె బ్లాక్‌మెయిల్ చేయడంతో తాను నేరానికి పాల్పడినట్లు చెప్పాడు.
నవంబర్ 6న, నోయిడా సెక్టార్ 108లోని ఒక విలాసవంతమైన ప్రాంతానికి సమీపంలోని కాలువలో ఒక మహిళ మృతదేహం ముక్కలై కనిపించింది. మృతురాలిని ప్రీతి యాదవ్‌గా గుర్తించారు. మహిళ రెండు చేతులు, ఆమె తల తెగిపోయింది. దీంతో మహిళను గుర్తించడం కష్టంగా మారింది. కేసును ఛేదించడానికి పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు 5000 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేశారు. 1000 కన్నా ఎక్కువ వాహనాలను ట్రాక్ చేశారు. 44 మంది అనుమానాస్పద వాహనాల డ్రైవర్లను ప్రశ్నించారు.
మహిళ మృతదేహం కనిపించిందని ఫోన్ వచ్చిన అదే సమయంలో ఒక ఘటనా ప్రాంతం నుంచి వెళ్తు్న్న అనుమానాస్పద వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మోనూను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 14న నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రీతి తన తల్లితో కలిసి జీన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఇది తామిద్దరి మధ్య పరిచయాన్ని పెంచిందని, తర్వాత ప్రీతితో లవ్ ఎఫైర్ పెట్టుకున్నట్లు నిందితుడు వివరించాడు.
Read Also: Le Bonnotte Potato: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళాదుంపలు.. కిలోకు ఏకంగా రూ. లక్ష!
ప్రీతి తరుచుగా తన నుంచి డబ్బు వసూలు చేస్తోందని, తన సంపాదనలో ఎక్కువ భాగం ఆమెకే ఇవ్వాల్సి వస్తోందని, డబ్బులు ఇవ్వకుంటే తనతో ఉన్న సంబంధం గురించి తన భార్య పిల్లలకు చెబుతానని బెదిరించడంతోనే హత్య చేసినట్లు నిందితుడు మోనూ విచారణలో వెల్లడించాడు. పదే పదే బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని, చట్టవిరుద్ధం కార్యకలాపాలు చేయాలని బలవంతం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఒత్తిడి తట్టుకోలేకే ప్రీతిని హత్య చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు.
నవంబర్ 5న, మోను ప్రీతి ఇంటికి వెళ్లి ఆమెను తన బస్సులో తీసుకెళ్లాడు. ఇద్దరూ రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లో పరాఠాలు, మ్యాగీ తినడానికి ఆగారు. అయితే, ఆ సమయంలో ఇద్దరి వాగ్వాదం చెలరేగింది. కోపంతో, మోను తన వెంట తీసుకెళ్లిన పదునైన ఆయుధంతో ప్రీతిపై దాడి చేసి, ఆమె తల నరికి చంపాడు. ఆమె మృతదేహాన్ని గుర్తించకుండా నిరోధించడానికి, అతను రెండు చేతులను కూడా నరికివేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని సెక్టార్ 108 కాలువలో పాడేశాడు. మహిళ తల, చేతుల్ని ఘజియాబాద్‌కు తీసుకెళ్లాడు. వాటిని బస్సు కింద వేసి తొక్కించి, నలిపేశాడు, ఆ తర్వాత వాటిని పారవేశాడు. పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధం, బస్సును స్వాధనం చేసుకున్నారు. వాహనంలో రక్తంతో తడిసిన చాప కనిపంచింది.