Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Kottu Satyanarayana Fires On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై ధ్వజమెత్తారు. పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని.. ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అని దుయ్యబట్టారు. అసలు తానేం మాట్లాడుతున్నాడో, అతనికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ మాటలు చూస్తుంటే.. అతని మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా బాధ్యత తీసుకుంటానని ఓసారి.. సీఎం అయ్యే బలం లేదని, పొత్తులుంటాయని మరో దగ్గర పవన్ చెప్తాడని అన్నారు. కత్తిపూడి సభలో సీఎం అయ్యేందుకు సంసిద్ధంగా ఉన్నానని పవన్ చెప్తాడని, అసలు పవన్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం అవుతోందా? అని నిలదీశారు. ద్వారంపూడి విసిరిన సవాల్‌కి పవన్ తోక ముడిచాడంటూ కౌంటరిచ్చారు.
Alla Nani: పవన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.. మాజీ మంత్రి ధ్వజం
Also Read
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
కాపుల మనోభావాలు దెబ్బతీసేలా ముద్రగడపై పవన్ అవాకులు చవాకులు పేలాడని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. నరసాపురంలో మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాడని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల టూర్ తర్వాత పవన్ మానసిక స్ధితిని అనుమానించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోందని సందేహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రతో పవన్ గ్రాఫ్ పదింతలు తగ్గిపోయిందని అన్నారు. పవన్ సభలకి వచ్చే జనాలు వేల సంఖ్యల నుంచి వందల సంఖ్యకి పడిపోయిందన్నారు. పవన్ ద్వారా గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు చీల్చాలని చంద్రబాబు వేసిన పాచిక పారలేదని తేల్చి చెప్పారు. అసలు కాపు ద్రోహి అయిన చంద్రబాబు పంచెన పవన్ ఎందుకు చేరాడో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి గొడవలోనూ జనసేన కార్యకర్తలే ఉంటారని, తమ కార్యకర్తల్ని గూండాలుగా, రౌడీలుగా తయారు చేసేలా పవన్ రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు.
Titan tragedy: టైటాన్‌కి “టైటానిక్ శాపం” తగిలిందా..? పలు సంఘటనల ఆధారంగా రూమర్స్..
రాష్ట్రం అగ్నిగుండంగా మారిందంటూ.. చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో పవన్ కళ్యాణ్ ఏ రోజూ ప్రశ్నించలేదన్నారు. మా పాలన చూసి ఓటు వేయమని ప్రజల్ని అడుగుతున్నామని.. మరి 2014-19 పాలన చూసి ఓటు వేయమని మీరు అడగలరా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. 219 దేవాలయాల్ని కూల్చేశామని పవన్ చెప్తున్నాడని.. మరి చంద్రబాబు హయాంలో గుళ్లు కూల్చేయలేదా? అని అడిగారు. సీఎం జగన్ కూల్చేసిన గుళ్లను తిరిగి నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వీడియో
-
Jananayagan : కళ్లు చెదిరే రేటుకు ‘జననాయగన్’ తెలుగు రైట్స్?
-
Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!