Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాగా, దర్శకుడు రవి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తన సినీ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపి.. “నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది వారి ఆశీర్వాదమే” అని అన్నారు. అలాగే తన గురువు దర్శకుడు మారుతిని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటూ.. “మీరు ఒకరోజు నేను డైరెక్టర్ అవుతానని నమ్మకం కల్పించకపోయి ఉంటే, ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు” అంటూ ఎమోషనల్ అయ్యారు.
తన సినీ ప్రయాణంలో ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచిన స్నేహితులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తన టీమ్ సభ్యుల సహకారం ఈ సినిమా పూర్తి చేయడంలో కీలకమైందన్నారు. నిర్మాతలు రాజేష్, సాయి రాజేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని జీవితాంతం మరిచిపోలేనని రవి చెప్పారు. “100 రోజుల పాటు ఓ కొత్త దర్శకుడిని నమ్మి సినిమా నిర్మించడం చాలా గొప్ప విషయం” అంటూ వారి సహకారాన్ని కొనియాడారు. అలాగే సంగీత దర్శకుడు మణిశర్మ, గేయ రచయిత అనంత శ్రీరామ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. “ఒక్క క్షణం కూడా నన్ను అనుమానించలేదు. కొత్త దర్శకుడినైనా పూర్తిగా నమ్మి నాకు అండగా నిలిచాడు. నా జీవితంలో ఎప్పటికీ ఆయన నా తొలి హీరోగానే ఉంటారు” అని అన్నారు. హీరోయిన్ గౌరీ నటన గురించి మాట్లాడుతూ.. “సెకండ్ హాఫ్‌లో ఆమె నటించిన ఓ సన్నివేశం ప్రేక్షకులను కదిలిస్తుంది. ఆ సీన్ తర్వాత చాలా రోజులు ఆమె గురించే మాట్లాడుకుంటారు” అని వెల్లడించారు. చివరగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి రవి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నప్పటి నుంచి తనకు చిరంజీవి అంటే అభిమానమని, ఈరోజు తన సినిమా ఈవెంట్‌కు ఆయన రావడం జీవితంలో మరచిపోలేని క్షణమని చెప్పారు. “మా అమ్మ ఒకప్పుడు చిరంజీవి నీకు కూడు పెడతాడా అనేది. కానీ ఇప్పుడు ఆయన మా ఈవెంట్‌కు రావడంతో సినిమా కలెక్షన్లు రెట్టింపు అవుతాయి. ఆ విధంగా ఆయన నిజంగానే నాకు కూడు పెడుతున్నారు” అంటూ సరదాగా చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి. మొత్తంగా తన 10 ఏళ్ల కష్టానికి ఈ సినిమానే సమాధానం అని అన్నారు. డైరెక్టర్ రవి చేసిన ఈ ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..