CPS Employees: సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPS Employees: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శాతవాహన కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహణకు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లలో ఏదో ఒక చోట ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశంపై అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణతో బుధవారం ఉదయం సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అయితే ఆందోళన కార్యక్రమాలను విరమించుకోవాలని, ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతుందని మంత్రి బొత్స సూచించారు.
Read Also: Eatala Rajender: బీజేపీ ఎమ్మెల్యే ఇంట విషాదం.. అనారోగ్యంతో తండ్రి మృతి
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
కాగా చర్చలకు రావాలని మంత్రి బొత్స పిలిస్తేనే తాము వచ్చామని ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాస్ ఎన్టీవీతో వ్యాఖ్యానించారు. పాత పెన్షన్ విధానమే కొనసాగించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. ఈ ఒక్క అంశం మీద మాత్రమే చర్చించామని తెలిపారు. తమ భవిష్యత్ గురించి తాము భయపడటం లేదని.. చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ముందస్తుగా బెదిరిస్తున్నారని.. ఏదేమైనా సెప్టెంబర్ 1న సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అటు పోలీస్ విభాగంలో కూడా చాలా మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నందున కచ్చితంగా తాము తలపెట్టిన కార్యక్రమానికి సహకారం లభిస్తుందని ఏపీసీపీఎస్ఈఏ ప్రజా సంబంధాల అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాకుండా సీపీఎస్ ఉద్యోగ సంఘాలకు మద్దతు ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీలకు ఈసారి ఏపీసీపీఎస్ఈఏ ఎలాంటి ఆహ్వానాలు పంపడం లేదని.. వారి మద్దతు తీసుకోవాలని తాము భావించడం లేదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్‌పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!