మంత్రి బొత్స సత్యనారాయణతో సీపీఎస్ ఉద్యోగుల చర్చలు ముగిశాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని సీపీఎస్ ఉద్యోగులు వెల్లడించారు. చాలా ఆశలతో చర్చలకు వచ్చిన తమకు సర్కారు పాత విషయాలనే చెప్పిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం జీపీఎస్‌పైనే చర్చించాలని చెప్పిందని ఉద్యోగులు తెలిపారు.
CPS Employees: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శాతవాహన కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహణకు, ఏలూరు రోడ్డు, బీఆర్‌టీఎస్ రోడ్లలో ఏదో ఒక చోట ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశంపై…