Swapna Dutt: ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. రివీల్ చేసిన టాప్ ప్రొడ్యూసర్ కుమార్తె
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swapna Dutt: ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ పేరు ఇండియా అంతా మార్మోగిపోతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ గురించి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ కుమార్తె స్వప్నదత్ ఓ కీలక విషయాన్ని రివీల్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన ప్రేమ పెళ్లికి కారణం ఎన్టీఆరేనని వెల్లడించింది. ఎన్టీఆర్‌తో వైజయంతి మూవీస్ బ్యానర్ శక్తి సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో స్వప్నదత్ ఎన్టీఆర్‌ను కలిసి తాను ప్రేమలో ఉన్న విషయం గురించి చెప్పింది. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి తాను భయపడినట్లు స్వప్నదత్ తెలిపింది. అయితే వెంటనే ఎన్టీఆర్ ఈ విషయం గురించి ఇంట్లో చెప్పేయమని సలహా ఇచ్చాడని.. కానీ అప్పట్లో తమ ఇంట్లో ప్రేమ పెళ్లిని అంగీకరించే పరిస్థితులు లేవని స్వప్న వెల్లడించింది.
Read Also: Viral News: అక్కడ అబ్బాయి రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే..? లేదంటే జైలుకే..!
Also Read
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
- The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
అప్పుడు ఎన్టీఆర్ వెంటనే స్పందించి… ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఆలస్యం చేయకూడదని..అశ్వనీదత్ గారితో తాను మాట్లాడతానని చెప్పాడట. ఈ మేరకు శక్తి సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేసి ఎన్టీఆర్ వచ్చి తన తండ్రి అశ్వనీదత్‌తో మాట్లాడాడని.. అలా తమ పెళ్లికి తారక్ మూలకారణంగా నిలిచాడని స్వప్నదత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఎన్టీఆర్ కుటుంబానికి, అశ్వనీదత్ కుటుంబానికి మంచి రిలేషన్ ఉండటంతోనే ఇది సాధ్యమైందని అభిప్రాయపడింది. 2010లో స్వప్న దత్ ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. కాగా వైజయంతి మూవీస్ ఇటీవల నిర్మించిన సీతారామం సినిమా డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా చూసినవాళ్లందరూ ఫిదా అయిపోతున్నారు. అటు ఎన్టీఆర్ కూడా కొరటాల శివ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!