CPM: ఏపీ సీపీఎంలో ముసలం.. బీవీ రాఘవులు సంచలన నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో విభేదాలు ఉన్నా.. అవి బయటపడ్డ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.. అంతర్గత సమావేశాల్లో అభిప్రాయ బేధాలు వ్యక్తం అయినా.. నిర్ణయానికి వచ్చేసారికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటారు.. అయితే, ఏపీ సీపీఎంలో అగ్రనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో సీపీఎంలో కీలక నేతగా ఉన్న బీవీ రాఘవులు.. సంచలన నిర్ణయం తీసుకున్నారట.. పొలిట్‌బ్యూరో నుంచి వైదొరడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సీపీఎం పార్టీ కేంద్ర నాయకత్వానికి బీవీ రాఘవులు లేఖ రాశారట.. అయితే, దీని వెనుక పెద్ద కథే ఉందనే ప్రచారం సాగుతోంది.. గత ఏడాది జరిగిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్లో బీవీ రాఘవులు ప్రస్తుత కార్యదర్శి వీ శ్రీనివాసరావుకు అనుకూలంగా వ్యవహరించాలని ఆరోపణలు రావడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
Read Also: Mekapati Chandrasekhar Reddy: రాజీనామాకు రెడీ.. మేకపాటి ఓపెన్ చాలెంజ్
Also Read
- AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
- Covid Cases In AP: ఏపీలో ఆగని కరోనా కేసులు.. బాపట్లలో ఒకరికి కరోనా పాజిటివ్..
- CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వెళ్లిపోవడానికి సీపీఎం సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ సిద్ధమయ్యారట.. అయితే, గఫూర్ ను వారించారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. మరోవైపు బీవీ రాఘవులు తీరుపై కేంద్ర కమిటీకి కొంతమంది ఏపీ నేతల ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతోంది.. ఉమ్మడి ఏపీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రాఘవులు.. ఎన్నో ప్రజాఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పడిపోయేందుకు దారితీసిన విద్యుత్ ఉద్యమానికి ఆద్యుడు కూడా ఆయనే.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు రాఘవులు. ఇక, ఆయనపై ఆరోపణలు వచ్చినప్పట నుంచి కేరళకు చెందిన మరో పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ ను తెలుగు రాష్ట్రాలకు పంపుతోంది కేంద్ర పార్టీ.. అప్పటి నుంచి మనస్తాపానికి గురై రాఘవులు.. పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకోవడానికే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ఉద్యమాలు చేస్తున్నా.. ఎర్రజెండా మసక బారుతోంది.. దీనికి తోడు అంతర్గత వ్యవహారాలు కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
తాజావార్తలు
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్‌స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
-
Suri Murd*er: హైదరాబాద్ మీర్ పేట్ లో రౌడీషీటర్ సూరి దారుణహత్య.!
-
AP COVID-19 Update: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పెరుగుతోన్న ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు
-
Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
-
Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!