Narayana: చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం.. ప్రభుత్వం వర్సెస్ సినీ పరిశ్రమగా మారింది.. కొందరు స్టార్లు ఓపెన్‌గా ప్రభుత్వాన్ని విమర్శంచడంతో ఇది మరింత రచ్చ రచ్చ అయిపోయింది.. కొందరు సినీ పెద్దలు రంగంలోకి దిగి ఎవరూ ఏమీ మాట్లాడొద్దని సూచించారు.. ఇక, మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఏకాంతంగా సమావేశం అయ్యారు.. ఎవ్వరూ లేకుండా ఆయన ఒక్కరే వెళ్లడాన్ని కొందరు ఆహ్వానిస్తుంటే.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ నేత నారాయణ.
Read Also: Surya Kumar Yadav: రెండో వన్డే: సూర్యకుమార్ వరల్డ్ రికార్డు…
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఫిల్మ్ ఛాంబర్‌కు, నిర్మాతల మండలికి సంబంధం లేకుండా సీఎం వైఎస్ జగన్.. కేవలం చిరంజీవితో మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నారు నారాయణ.. విభజించు.. పాలించు అనే విధానం సరికాదని సూచించిన ఆయన.. ఉద్యోగుల సమస్యల్లోనూ ప్రభుత్వం విభజించు.. పాలించు అనే విధానం అనుసరించిందని ఫైర్ అయ్యారు.. ఇక, ఉద్యోగుల సమస్యలలాగే సినీ పరిశ్రమ సమస్యలను ప్రభుత్వం మేనేజ్ చేయాలని చూస్తోందని ఆరోపించారు నారాయణ.. ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.. మేనేజ్ చేసే వ్యవహారం మంచిది కాదని.. మా, ఫిల్మ్ ఛాంబర్‌ని కూడా చర్చలకు పిలిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని అభిప్రాయపడ్డారు. కాగా, గతంలోనూ వైఎస్ జగన్-చిరంజీవి భేటీపై స్పందించిన నారాయణ.. చిరంజీవి ఒంటరిగా సీఎంను కలవడం ఆయన చేసిన పొరపాటని పేర్కొన్నారు.. చిరంజీవి ప్రత్యేక విమానంలో ఆగమేఘాల మీద వెళ్లి.. సీఎంను ఒంటరిగా కలవాల్సిన అవసరమేంటి. సమస్య సినీ పరిశ్రమదే తప్ప, వ్యక్తిగతంగా చిరంజీవిది కాదుగా అంటూ ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!