ఏపీలోని ఈ జిల్లాలో నేటి నుంచి కఠినంగా కరోనా నిబంధనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా థర్డ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కడప జిల్లాలోని పోలీస్ శాఖ శుక్రవారం నుంచి కఠినంగా కరోనా నిబంధనలు అమలు చేయబోతోంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, ధరించని వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
Read Also: దేశంలోనే టాప్.. ఏపీకి 10 స్కోచ్ అవార్డులు
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్‌పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే ఫంక్షన్ హాళ్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో ప్రజలు హాజరయ్యేలా చూడాలని, పరిమితికి మించి జన సమూహం చేరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. దుకాణ యజమానులు తమ షాపుల ఎదుట సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ వేయాలని, షాప్ ఎదుట తాడు కట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులపై డీఎం యాక్ట్ (డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్) కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హోటల్ నిర్వాహకులు హోటల్‌లో సర్వర్లు, ఇతర ఉద్యోగులు ఖచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.
తాజావార్తలు
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
-
Peddi OTT Release: రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పుడు ఇంట్లోనే.. కానీ ఈ ఒక్క భాషకు వెయిటింగ్ తప్పదు!
-
Astrology: జూన్ 29 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!