Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అర్నబ్ తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి అధికారులతో పరిస్థితులను సమీక్షించారు. కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలవారీగా తుఫాన్ ప్రభావం, సహాయక చర్యల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులను, సహాయక చర్యలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు.
ఆరు జిల్లాల్లో అధిక వర్షపాతం
గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం, జిల్లాలవారీగా ప్రస్తుత పరిస్థితులను ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కోనసీమ జిల్లాలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్లు తెలిపారు. ఇదే జిల్లాలో సుమారు 10 వేల ఇతర చెట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 4 వేల చెట్లు కూలిపోయినట్లు వివరించారు.
Also Read
- Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
- Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న 'అర్నబ్'.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
- Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
జాతీయ రహదారి-16పై చెట్ల తొలగింపు పూర్తి
తుఫాన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో రహదారులపై చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇతర ప్రాంతాల్లోనూ చెట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయని, మధ్యాహ్నం 3 గంటల నాటికి ఈ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు.
విద్యుత్ పునరుద్ధరణను వేగవంతం చేయాలి
తుఫాన్ సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల కోసం ఏపీసీపీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని పంపించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రహదారులపై కూలిన చెట్లను వెంటనే తొలగించి సాయంత్రంలోగా అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజలకు విద్యుత్, తాగునీరు, రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనాలు
తుఫాన్ కారణంగా వ్యవసాయం, ఉద్యానవన రంగాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సంబంధిత శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పశుసంపదకు జరిగిన నష్టం, ఇళ్లు కూలిపోవడం, నీట మునగడం వల్ల కలిగిన నష్టాన్ని కూడా అంచనా వేయాలని సూచించారు. విద్యుత్ వ్యవస్థలు, రహదారులకు జరిగిన నష్టంతోపాటు చెరువులకు గండ్లు పడిన అంశాలపై క్షేత్రస్థాయి నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించాలని తెలిపారు. నష్టానికి సంబంధించిన వివరాలను సంబంధిత శాఖలు సమన్వయంతో సేకరించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.. మరోవైపు.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులకు చెప్పారు.. సీసీటీవీ కెమెరాల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతోపాటు వరద నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రహదారులపై రాకపోకలకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
గత తుఫానుల అనుభవాలతో విపత్తుల నిర్వహణ
గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని 26 తుఫాన్లు తాకాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో సంభవించిన దివిసీమ ఉప్పెనలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని గుర్తుచేశారు. దివిసీమ ఉప్పెన, హుద్‌హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో పెనుగాలులు తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. గతంలో వరదల సమయంలో అప్పటి ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవస్థలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. బుడమేరు వరదల సమయంలో విజయవాడలోనే ఉండి పరిస్థితులను చక్కదిద్దగలిగామని పేర్కొన్నారు. ప్రస్తుతం అర్నబ్ తుఫాన్ సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని తాకిన ప్రతి తుఫాన్ నుంచి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే పాఠాలను నేర్చుకుంటున్నామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతున్నామని వివరించారు చంద్రబాబు..
క్షేత్రస్థాయి సమాచారంతో తక్షణ నిర్ణయాలు
అన్ని స్థాయిల్లోని అధికారులు ఒకే విధమైన ఆలోచనతో పనిచేయాలని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని, డేటాను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారానికి అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకుని వాటిని సమర్థంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను కాపాడేందుకు, వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
-
Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
-
Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!