కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అనేక దేవాలయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా తిరుమల ఆలయానికి భక్తుల రద్ధీ తగ్గిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీవారీ దర్శనాలు, ఆదాయంపై కరోనా ఎఫెక్ట పడింది. మే నెలలో భక్తున సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మే నెలలో మొత్తం 2,13,749 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.11.95 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మే నెలలో 91,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కరోనా ప్రభావం, ఆంక్షలు లేని రోజుల్లో ఏప్రిల్, మే నెలలో తిరుమలకు భక్తులు పోటెత్తేవారు. తిరుమల వీధులు జనసంద్రంగా మారిపోతుంది. దర్శనానికి గంటల కొద్ది సమయం పడుతుంది.