విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన కార్యకర్తలకు కోర్టులో షాక్ తగిలింది… జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి ఆదివారం రాత్రి జిల్లా కోర్టు జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు అరెస్ట్ అయిన వారిలో 61 మంది జనసేన నాయకులకు రూ.10వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే కాగా.. మరో 9 మంది నేతలకు ఈనెల 28 వరకు రిమాండ్ విధించారు.. అయితే, బెయిల్ కోసం కోర్టు మెట్లు ఎక్కారు జనసేన నేతలు.. కానీ, కోర్టులో జనసైనికులకు చెక్కెదురైంది.. జనసేన వేసిన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసిన కోర్టు.. ఇదే సమయంలో కస్టడీకి అనుమతి ఇచ్చింది… జనసేన కార్యకర్తలకు బెయిల్ ఇవ్వొద్దని వాదించిన పోలీసులు.. కస్టడీ పిటిషన్ వేశారు.. 9 మందిని కస్టడీకి కోరారు పోలీసులు.. దీంతో, కస్టడీకి అనుమతి ఇచ్చారు న్యాయమూర్తి. కాగా, విశాఖ ఘటనకు సంబంధించి తమ జనసైనికులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. అరెస్ట్ చేశారు.. అయితే, పోలీసులు కేసులు నమోదు చేసిన వారిని జనసేన లీగల్ సెల్ బెయిల్‌పై బయటకు తీసుకొచ్చింది.. కానీ, మరో 9 మందికి మాత్రం బెయిల్ దొరకలేదు.. కోర్టు రిమాండ్ విధించింది.. ఇక, అరెస్ట్ అయిన నేతలు, కార్యకర్తలకు అండగా ఉండాలని పవన్ నిర్ణయించారు.
Read Also: YSRCP : మూడేళ్లలో రైతులకు రూ. 1.33 లక్షల కోట్ల సాయం