Supreme Court: పరిహారం ఇప్పించాలని సుప్రీంకోర్టుకు వెళ్లితే అక్కడ కోర్టు అతడికి మొట్టికాయలు వేసింది. యూట్యూబులో వచ్చే లైంగిక యాడ్స్ కారణంగా తను పోటీ పరీక్షల్లో నెగ్గలేకపోయానంటూ.. తనకు న్యాయం చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు పనికిమాలిన పిటిషన్ వేసినందుకు రూ.25,000 జరిమానా కూడా విధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనంద్ కిషోర్ చౌదరి, ఆ రాష్ట్ర పోలీస్‌లో చేరేందుకు పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యాడు. ప్రిపరేషన్ కోసం యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాడు. అయితే యూట్యూబ్ వీడియోల్లో వచ్చిన కొన్ని లైంగిక యాడ్స్ వల్ల తన ఏకగ్రత దెబ్బతిన్నదని అతడు ఆరోపించారు. దీని వల్ల పోలీస్ ఉద్యోగ పరీక్షలో విఫలమైనట్లు పేర్కొన్నాడు.
Read Also: Shocking Video: వేరే వ్యక్తితో మాట్లాడుతుండగా రైల్వే టీసీపై తెగిపడిన కరెంట్ వైర్
యూట్యూబ్ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. కాగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం ఆనంద్ కిషోర్ పిటిషన్‌ను తిరస్కరించింది. తన వాదన వినిపించేందుకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన అతడికి చీవాట్లు పెట్టింది. మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద దాఖలైన అత్యంత దారుణమైన పిటిషన్లలో ఇది ఒకటని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పబ్లిసిటీ కోసం వేసే ఇలాంటి పిటిషన్లు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయని మండిపడింది. అంతేగాక పిటిషనర్ ఆనంద్ కిషోర్‌కు రూ.25,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.