Family Doctor Program : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు.. దీని కోసం రేపు అనగా ఈ నెల 6వ తేదీన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించనున్నారు.. లింగంగుంట్లలో పర్యటించనున్న సీఎం.. ఫ్యామిలీ డాక్టర్ విధానం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఇక, ఈ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి విడదల రజిని పరిశీలించారు. సీఎం ముందుగా లింగంగుంట్ల గ్రామం చేరుకుని ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని పరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ శివ శంకర్ తెలిపారు.. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.. ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించింది ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధం అవుతోంది.. ఇప్పటికే 676 వాహనాలు (104) సేవలు అందిస్తుండగా, కొత్తగా వచ్చే 234 వాటితో కలిపి ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్ అమలుకోసం 910 వాహనాలు (104)లను వినియోగించనున్నట్టు అధికారులు ప్రకటించారు.. అలాగే ప్రతిజిల్లాకు బ్యాక్‌అప్ కింద మరో 104 వాహనాన్నికూడా రిజర్వ్‌లో ఉంచుతున్నామని తెలిపారు. ఉదయం 9 గంటలనుంచి 4 గంటలవరకూ విలేజ్‌క్లినిక్‌లో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్ ఉండనున్నారు..
Read Also: Bezawada Drugs case: బెజవాడ డ్రగ్స్ కేసులో కీలక పురోగతి
జనరల్ ఓపీ, నాన్‌కమ్యూనికబుల్ డిసీజ్ మేనేజ్‌మెంట్, గర్భవతుల ఆరోగ్య రక్షణ, అంగన్‌వాడీల సందర్శన, అందులో పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, స్కూళ్ల సందర్శన, అందులోని పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణపై దృష్టి, మంచానికే పరిమితమైన పేషెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి, వారి ఇళ్లకే వెళ్లి సేవలు అందించడం, పంచాయతీ కార్యదర్శితో కలిసి.. గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ.. ఈ విధులన్నింటినీ కూడా ఫ్యామిలీ డాక్టర్ నిర్వర్తిస్తారు. డిస్ట్రిక్‌హబ్స్‌లో ఉండే స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా టెలిమెడిసన్ పద్ధతుల్లోకూడా వీరికి సేవలందించేలా చూస్తారు. హైపర్‌టెన్షన్, డయాబెటీస్‌లాంటి నాన్‌కమ్యూనికబుల్‌డిసీజ్‌లతో బాధపడుతున్న వారి డేటా కూడా ఫ్యామిలీ డాక్టర్‌కు అందుబాటులో ఉంటుంది. ఫాలోఅప్ ట్రీట్‌మెంట్‌కోసం ఈ డేటాను వినియోగించనున్నారు. ఇక, సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి విడదల రజిని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని చిలకలూరిపేట నియోజకవర్గంలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈనెల 6వ తేదీ ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం దేశంలోనే ఒక ఐకానిక్ గా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.