Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cm Ys Jagan Suspends Four Ycp Mlas After Mlc Elections Results

YCP MLAs Suspension: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు

Published Date :March 24, 2023 , 5:43 pm
By Sudhakar Ravula
YCP MLAs Suspension: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌.. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

YCP MLAs Suspension: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అధికార వైసీపీ గెలవాల్సి ఉన్నా.. క్రాస్‌ ఓటింగ్‌తో ఓ స్థానాన్ని కోల్పోయింది.. దీంతో, వైసీపీకి షాక్‌ తగిలినట్టు అయ్యింది.. ఇక, దిద్దబాటు చర్యలకు దిగింది వైసీపీ అధిష్టానం.. క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించింది.. తన మార్టీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. టీడీపీకి అనుకూలంగా ఓటు వేసినట్టు నిర్ధారణకు వచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్‌ ఉల్లంఘించినందుకు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించారు.

సీఎం వైఎస్‌ జగన్ చివరి నిమిషంలో చెప్పి షాక్‌లు ఇవ్వరు.. పారదర్శకంగా వ్యవహరించే నాయకుడు జగన్ అని తెలిపారు సజ్జల.. అందుకే ముందుగానే టికెట్ ఇచ్చే అవకాశం లేదని వారికి సంకేతాలు ఇచ్చారని.. అందుకే వారు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు.. ఇక, చంద్రబాబు నాయుడు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ. 20 కోట్ల వరకు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టారని మాకు సమాచారం ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాకున్న సమాచారం, విచారణ ఆధారంగానే ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని పార్టీ అభిప్రాయానికి వచ్చింది.. అందుకే సస్పెండ్‌ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి.. ఇది రోగం లాంటిది.. అందుకే ముందే నిర్ణయం తీసుకున్నాం అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. డబ్బులు చేతులు మారాయి.. ఇతర కారణాలు కనిపించలేదన్న ఆయన.. టికెట్లు ఇస్తామని కూడా చెప్పి ఉండవచ్చు అని తెలిపారు.. గతంలోనూ చంద్రబాబు ఇలానే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు.. తర్వాత పూర్తి స్థాయిలో పేమెంట్లు కూడా చేసినట్లు లేడు అంటూ ఎద్దేవా చేశారు.. ఇటువంటి విషయాల్లో పార్టీ సీరియస్ గా ఉంటుంది.. అందుకే చర్యలు తీసుకున్నామని ప్రకటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. కాగా, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక‌ల్లో ప్రతిప‌క్ష టీడీపీ అభ్యర్థి పంచుమ‌ర్తి అనురాధ గెలుపొందేందుకు అవ‌స‌ర‌మైన మెజారిటీ లేకున్నా 23 ఓట్లతో విజ‌యం సాధించారు. దీంతో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన‌ట్లు తేలిపోయిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM YS Jagan
  • Four YCP MLAs
  • MLC ELECTIONS
  • MLC Elections Results

తాజావార్తలు

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Chanakya Niti: కోట్లు సంపాదించాలన్నా .. కూటికి లేని బిచ్చగాడు కావాలన్నా ఈ అలవాట్లే కారణం.. చాణక్యుడు చెప్పిన కెరీర్ సీక్రెట్స్!

  • Prabhsimran Singh: టెన్షన్ వద్దు, స్వేచ్ఛగా ఆడమన్నాడు.. నా సక్సెస్‌కు కారణం అతడే!

  • Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..

  • Indian Growth: భారత వృద్ధి రేటును తగ్గించిన ప్రపంచ బ్యాంక్.. ప్రస్తుతం ఎంతంటే..

ట్రెండింగ్‌

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions