AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఆంధ్రప్రదేశ్‌లో 2026–27 ఎక్సైజ్ పాలసీ కింద మద్యం దుకాణాల పునరుద్ధరణ, కేటాయింపు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలను ప్రభుత్వం నోటిఫై చేయగా.. ఇప్పటికే 2,929 దుకాణాల లైసెన్సుల పునరుద్ధరణ పూర్తయింది. దీంతో మొత్తం నోటిఫై చేసిన దుకాణాల్లో 92 శాతం దుకాణాల ప్రక్రియ పూర్తయినట్లు ఎక్సైజ్ కమిషనర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. మరో 517 మద్యం దుకాణాలను అక్టోబర్ 8న లాటరీ ద్వారా కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ 517 దుకాణాల కేటాయింపు పూర్తయితే మొత్తం 3,446 మద్యం దుకాణాల పునరుద్ధరణ లేదా కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీ 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది. ఈ పాలసీ ప్రకారం ఇప్పటికే కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్సులను పునరుద్ధరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే 2,929 దుకాణాల లైసెన్సులు ఇప్పటికే పునరుద్ధరించబడ్డాయి. అక్టోబర్ 8న 517 దుకాణాల కేటాయింపు పూర్తయిన తర్వాత ఇంకా 290 దుకాణాలు మిగిలి ఉంటాయని ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఈ మిగిలిన దుకాణాలకు విడిగా నోటిఫికేషన్ జారీ చేసి, తదుపరి కేటాయింపు ప్రక్రియ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే పనిచేయని దుకాణాలతో పాటు మిగిలిన దుకాణాలను కలిపి మొత్తం 807 దుకాణాలను లాటరీ విధానంలో కేటాయించేందుకు నోటిఫై చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ దశలవారీగా కొనసాగుతోంది.
Also Read
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
తాజావార్తలు
-
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల కేటాయింపులో కీలక అప్డేట్..
-
Lenovo ThinkBook 14x: లెనోవా ThinkBook 14x వచ్చేసింది.. 120Hz OLED డిస్ప్లే, Core Ultra ప్రాసెసర్
-
Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
-
Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!