Ambika Krishna: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అంబికాకృష్ణ.. ఆనాడు ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చారు.. కానీ, ఎన్నోసార్లు నంది అవార్డులు ఇవ్వాలని అప్పటి సీఎం చంద్రబాబును అడిగా.. కానీ, ఏనాడు స్పందించలేదని విమర్శించారు.. స్టూడియోల కోసం మంచి స్థలాలు ఉన్నా.. ముందుకు వెళనివ్వలేదన్న ఆయన.. ఎక్కడా చంద్రబాబు సహకరించలేదని మండిపడ్డారు.. మనం ఎన్ని ప్రయాత్నలు చేసిన పైనున్న వారికి ఆసక్తి ఉండాలి కదా? అని ప్రశ్నించారు. అయితే, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అలా కాదు.. ఆయనకు ఆసక్తి ఉంది.. ఇక, పోసాని సమర్దుడు కావడంతో వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.. విజయవాడలో ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు..
Read Also: Pakistan PM: ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు.. తలొగ్గక తప్పని పరిస్థితి..
ఇక, జగన్ మోహన్ రెడ్డి అభిమానులంతా పోసాని అభిమానులే అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్నినాని.. జగన్ కోసం ఎంత దూరం అయినా వెళ్లే వ్యక్తి పోసాని.. విశాఖపట్నంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలని సీఎం ఆకాంక్షించారు.. వంద ఎకరాల్లో స్టూడియోల నిర్మాణం కోసం చేయడానికి సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. ఎన్నికల సమయంలోనే విశాఖ వేదికగా సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం అన్నారు. నాటక రంగాని ఆదర్శించే వారు లేరు.. కనీసం చప్పట్లు కొట్టే వారు కూడా లేరని మండిపడ్డారు.. ఇక, సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. పోసాని భాద్యతలు తీసుకోవడం సినీ పరిశ్రమకు శుభపరిమాణంగా అభివర్ణించారు.. జగన్ మోహన్ రెడ్డి ఆశ నెరవేరుతుంది.. ఇప్పటికే వైజాగ్‌లో ప్రభుత్వ భూమి కేటాయించిందని.. వైజాగ్ తనతో పాటు సినీ పరిశ్రమ రావాలని సీఎం కోరికగా చెప్పుకొచ్చారు.